Wednesday, November 23, 2011

పోతన - శ్రీమధ్భాగవతము శ్లోకాలు




పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగు నఁట
పలికెద వేఱొండు గాథ బలుకఁగనేలా.

 

మహాభక్తుడైన పోతన సర్వం దైవాయక్తంగా భావిస్తూ భాగవత గ్రంథ కర్త్తుత్వానికి కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణే అధికారిగా నిల్పుతూ చెప్పిన పద్యం ఇది.

చెప్పే గ్రంథమేమో భాగవతం - అంటే భక్తుల చరిత్రమూ, ఆ భక్తులకు కుదురైన శ్రీ హరి చరిత్రమూ. మరి ఆ శ్రీ హరిలీలలు అనంతాలు కదా, అవి వర్ణించడానికి ఎవరికి సాధ్యం? అందుకే పలికించే విభుడు ఆ రామ భద్రుడే! అంటూ వ్యక్తం చేశాడు పోతన. "పలికించు విభుండు రామభద్రుండట" అంటూ చెప్పి పోతన శ్రీ రామచంద్రునికి "విభు" శబ్దంతో జగన్నాయకత్వాన్నీ, "భద్ర" పదంలో లోక రక్షకత్వాన్నీ సంక్రమింపజేస్తూ రామచంద్రుడు సాక్షాత్తు శ్రీ హరే సుమా అంటూ తెలియజేసినాడు. 

అప్పుడు పలికించే ప్రభువు శ్రీ హరికాగా పలికేది శ్రీహరిచరితం అంటే భాగవతం ఐంది. ఇంతకంటే పుణ్యం కానీ, పుణ్య వస్తు సంకీర్తనం కానీ ఇంకేముంటుంది? ఇటువంటి కథను పలకడం వల్ల ఏమిటీ లాభం? అంటే భవహరం, ఇక జన్మ లేకపోవడం. అందుకే పోతన వేరే కథను చెప్పడం ఎందుకూ? సంసార బంధాలు సమసిపోయే ఈ హరికథనే చెబుతానంటూ భాగవతాన్ని ప్రారంభం చేశాడు.



చేతులారంగ శివునిఁ బూజింపఁడేని

నోరునొవ్వంగ హరికీర్తినుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.


’చేతులారంగ’ అంటే చేతులనిండుగా తృప్తితో శివపూజ చేయనివాడూ, ’నోరునొవ్వంగ’ అంటే ఎల్లప్పుడూ హరినామ, గుణకీర్తనం చేయనివాడూ, సత్యమూ, దయా మొదలైన మంచి గుణాలను గూర్చి ఆలోచించనివాడూ పుట్టడం కూడా వ్యర్థమే. వాడి జన్మ తల్లికడుపు పంటగా కాకుండా, తల్లికడుపు మంటగా నిలుస్తుంది అంటూ కొంత ఘాటుగానే మందలించినాడు పోతన. 

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలం,
గలడందు రన్ని దిశలను,
గలడు గలం డనెడివాడు గలడో? లేడో?


దీనుల యెడ ఉన్నారంటారు, 
పరమ యోగులందూ ఉన్నాడంటారు, 
నాల్గు దిక్కుల్లోనూ ఉన్నాడంటారు, 
"ఉన్నాడు ఉన్నాడు" అనేవాడసలు ఉన్నాడో? లేడో?

మనిషికి సందేహముండరాదు. ఆ సందేహమే మనిషిని కాకుండా, అతనిపని యేదీ కాకుండా చేస్తుంది.

గజేంద్రుని సందేహం వలనే ఈశ్వరుడు అతని రక్షణకు రాలేక పోయాడన్న విషయాన్ని యీ పద్యం ముఖాన మహాకవి సందేశమిచ్చాడు.
 



ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై,
యెవ్వనియందు డిందు, బరమేశ్వరుఁడెవ్వఁడు, మూలకారణం
బెవ్వఁ, డనాది మధ్యలయుఁ డెవ్వఁడు, సర్వము దానయైన వాఁ
డెవ్వఁడు, వాని నాత్మభవు, నీశ్వరు,నే శరణంబు వేఁడెదన్.


ఈ సృష్టి యంతయు ఒకే ఒక దేవుని వలన పుట్టుచున్నది. ప్రళయ కాలమున వాని యందే లీనమైయుండి, మరల సృష్టికాలము వరకు వానియందే నిద్రించు చుండును. కనుక అన్ని సృష్టులకును పరమేశ్వరుడైనవాడొక్కడె! అతడే కారణముల కన్నింటికిని మూలకారణమైనవాడు. వానికి మొదలు, ఉండుట, అంతరించుట యనునవి లేవు. అతడు తనంతట తానే యుండును. అట్టి ఒకేఒక్క ఈశ్వరుని నేను శరణు వేడుచున్నాను. 


లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు -
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.


భూలోకము మొదలు పాతాళము వరకుగల అథోలోకములు, సత్యలోకము వరకుగల ఊర్థ్వలోకములు ఈ సృష్టిలోని భాగములు. కాలగమనములో ఆయా లోకములలోని జీవులు, ఆ లోకములు, ఆ లోకముల కధిపతులైన దేవతలు, చివరకు బ్రహ్మాదులు కూడ సృష్టి పరిణామక్రియలో అంతమై పోవుదురు. ఆ వెనుక నున్నది పెంజీకటి; అనగా దుర్భేద్యమైన చీకటి. అది మాయామయ మగు మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతికి కూడ వెనుకగా ఒకే ఒక వెలుగు తనలో తాను వెలుగు చుండును. అట్టి జ్యోతి స్వరూపుడైన దేవుని నేను సేవింతును. 

అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహి! పాహి" యన గుయ్యాలించి సంరంభియై"


మొసలి పట్టు విడిపించుకోలేని గజరాజు మొఱపెట్టి మొఱపెట్టి, కొంతవరకు సందేహించి, తరువాత దిక్కుతోచక చివరకు "నీవే తప్ప యిత: పరంబెరుగ" నని చేతులెత్తాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు డెలా ఉన్నాడో యీ పద్యం నిరూపిస్తుంది.

వైకుంఠపురంలో ఆమూల సౌధంబు దాపల మందార వనంలో, అమృత సరోవరం ప్రక్కన ఉన్న చంద్రశిలా వేదిపై కలువ పూపాన్పుపై కూర్చున్న ఆపన్న ప్రసన్నుడు గజేంద్రుని మొఱ ఆలకించాడు
 


లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్చ్హ వచ్చె, దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

"నీవే తప్ప యితః పరంబెరుగ, మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!"


ఈ పద్యంలో భక్తుడు భగవంతుని చేరే విధానం నిరూపింపబడింది.

నేను చిక్కిపోయాను, ధైర్యం చెదరింది, ప్రాణాలా వాటి స్థానాలు తప్పుతున్నాయి. మూర్చ వచ్చింది, శరీరమంతా డస్సింది, శ్రమయింది, నీవు తప్ప నాకింకెవరూ లేరు.
నా తప్పులు నన్నించు, దీనుడను, రక్షింపగా యీశ్వరా రమ్ము, భద్రాత్మకా;
 


సిరికిం జెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబు జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోధ్ధత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై


తన ప్రక్కనున్న శ్రీ దేవికి చెప్పలేదు, శంఖ చక్రాలు ధరించలేదు, పరివారాన్నైనా పిలువలేదు. గరుత్మంతుని కూడా పిలువలేదు. ఇంతెందుకు? సరస పరిహాసాకుశలుడై శ్రీలక్ష్మి పైటచెరగు పట్టుకొని గజేంద్ర రక్షణ కొఱకు లాక్కొని పోతున్నాడు. 

మందార మకరంద మాధుర్యమున తేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునె తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోకిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు

అంబు జోదర దివ్య పాదారవింద
చింతనామృతపాన విశేషమత్త
చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల.


మందార పుష్పాల మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పుష్పాలకి పోవగలదా? నిర్మలాతి నిర్మలంగానున్న పరమపావని గగనగంగా తరంగాలలో దేలి అచటగల తామరతూడులను భక్షించు రాజహంస చిన్న మురికిగుంటలవలె నున్న తరంగిణులకు చనునా?

తీయ మామిడి గున్న చిగురుటాకులు తిని ఆనందించు కోయిలమ్మ ఉమ్మెత్త పూవులకు సేరునా? పరిపూర్ణ పూర్ణిమా చంద్రునిలోగల అమృతకిరణాల్ని ఆహారంగా గొను చకోరం దట్టమైన మంచుగడ్డల కరుగునా?

అలాగే శ్రీమహావిష్ణు పాదారవింద ధ్యానామృత పానంతో విశేషమైన మత్తుగల నా చిత్తం యింకొకదానికి చేరుతుందా? చేరదు తండ్రీ!



కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీ నాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి తవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుధ్ధి బుధ్ధి

దేవ దేవుని చింతించు దినము దినము
చక్ర హస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు
తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!


దానవేంద్రా!

హరి సేవకు నోచుకోని శరీరం వున్నదే అది గాలి నింపిన తోలుతిత్తి. విష్ణు సంకీర్తనం ఎరుగని నోరు ఢం ఢం ధ్వని చేసే ఢక్క. హరిని పూజించని హస్తాలు కర్రతో చేసిన గరిటెలు.

కమలావతిని చూడని కన్నులు శరీరమనే గోడకు కొట్టిన కన్నాలు. శ్రీ పతిని గిరించి యోచించని జన్మ గాలిబుడగ. విష్ణుభక్తి ఎరుగని విధ్వాంసు డున్నాడే వాడు ద్విపాద పశువు.


శ్రీ కైవల్య పడంబున్ జేరుటకునై చింతించెదన్, లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభాకున్, గేళి లోల విలసద్ద్రుగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్ 

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిన్ గపాలికి మన్మధ గర్వ పర్వతో 
న్మూలికి నారదాది ముని ముఖ్య మస్సరసీరుహాలికిన్ 

ఆతత సేవన్ జేసేద సమస్త చరాచర భూత సృష్టి వి 
జ్ఞాతకు భారతీ హృదయసౌఖ్య విధాతకు వేద రాశి ని 
ర్ణేతకు దేవతా నికర నేతకున్ గల్మషజేతకున్ నాథ 
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్ 


అమ్మలగన్న  యమ్మ  ముగురమ్మల  మూలపుటమ్మ  చాల  పెద్దమ్మ  సురారులమ్మ  కడుపారడి  పుచ్సినయమ్మ  తన్ను  లో 
నమ్మిన  వేల్పుటమ్మల  మనమ్ముల  నుమ్డేది  యమ్మ  దుర్గ  మా  యమ్మ  క్ర్పబ్ది  యివుట  మహత్వ  కవిత్వ  పటుత్వ  సంపదల 




Monday, March 28, 2011

విష్ణు సహస్రనామం వైశిష్టం

విష్ణు సహస్రనామం ఎవరినా చదవచ్చు ,ఎక్కడిన చదవాచు .మీరేపని చేసుకుంటూ నామం చేసుకోవచ్చు.
మంత్ర జపం అలా చేయలేము. మంత్ర జపం చేయటానికి అంగన్యాస కరన్యాస  ఉంటుంది. లలిత సహస్రనామం అలా చదవలేము . అది గురుముకుతః నేర్చు కోవాలి . నిలబడి మాత్రం చదవకూడదు , కూర్చొని మాత్రమే చదవాలి . విష్ణు సహస్రనామంకి అ నియమము  లేదు.
ఎందు చేత అంటే . జాగృత్ అవస్థ  అనగా ఇందరియములు పనిచేయట . పడుకోవటం అంటే నిద్రావస్థ మనసు ఇంద్రియములు వెనక్కు లాకుంటుంది. దీనికి అది దేవత పరమేశ్వరుడు . అందుకే పడుకునే ముందు "శివ శివ" అని 11 మార్లు చెప్పాలి. నిద్ర లేచినాక జాగ్రుతవస్థ , విష్ణువు స్తితి కారకుడు కావున "శ్రీహరి శ్రీహరి శ్రీహరి " అని ౩ మార్లు చెప్పాలి . నిద్ర లేచిన తరువాత శుచిగా ఉంటామని ఆస్కారం లేదు. కావున విష్ణు సహస్రనామం చెప్పటానికి సుచి సమయం అంటూ శాస్త్రం లో ఎక్కడ  చెప్పలేదు .
మంచం మేద ఎటువంటి పని చేయకూడదు ( కొత్త బట్టలు పెట్టకూడదు , మందు వేసుకోకుడదు , చివరికి మనషి చనిపోయే సమయం లో మంచం మేద ఉంచకూడదు  ). మనకి మంచం మేద ఎటువంటి దుస్వప్నము వచ్చిన తెల్లవారి గజేంద్ర మోక్షం చదువుకుంటే దోషం పోతుందని  అంటారు. మనం అంత వరకు ఉండలేము కాబట్టి .
గోవింద నామం చెప్పమంటారు.విష్ణు సహస్రం ఏ కారణం చేత విడువరదని శాస్త్రం చెప్పుచున్నది .  

దేవాలయం లో 8 మన్దిగ  విభాగిస్తారు . అర్చకుడి 8 వంతు  చరముర్తి అంటారు
 1 ) శికరం 2 ) ప్రకారం 3 ) గోడ 4 )  ముక మంటపం   5 ) అర్ధ మంటపం 6 ) ధ్రువ మూర్తి 7 )  విమాన మూర్తి   
 8 ) అర్చకుడు 

ఎవరితే విష్ణు సహస్రనామంస్తోత్రం గొప్ప వరం ఎవరితే  పారాయణము చేస్తారో  ఇహమునందు రక్షణ లబిస్తుంది 





  









Wednesday, March 2, 2011

Shiva Slokas



సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మామ్|భవోద్భవాయ నమః 

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-
శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ 
నమో మనోన్మనాయ నమః 

అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేభ్య-స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః 

త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాஉమృతాత్ 

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 
తన్నో రుద్రః ప్రచోదయా”త్ 

ఓ౦ నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ 
మహాదేవాయ త్రయంబకాయ 
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ 
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః 

ఓం శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే 
కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే 
యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే
విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే
సూశ్చమే  ప్రసూశ్చమే  సీరంచమే లయశ్చమ 
ఋతంచమే உమృతంచమేஉయక్ష్మంచమేஉనామయచ్చమే 
జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమేஉనమిత్రంచమేஉభయంచమే 
సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే|  
సదాశివోమ్ ! 

ఓం శాంతిః శాంతిః శాంతిః 

Shiva Ratri

                                    అందరికి  శివ రాత్రి   శుభాకంక్షలు